వైరల్‌: బద్దకస్తులంతా ఇక్కడో లుక్కేయండి..!

Australian Dog Doing Exercises Viral Video - Sakshi

వ్యాయామంతో శారీరక, మానసిక ఒత్తిడి తొలగి ఉల్లాసంగా ఉంటామనే సంగతి మనందరికీ తెలిసిందే! అయినా వ్యాయామం చేయడానికి బద్ధకిస్తాం! ఇందుకు కారణాలనూ వెతుక్కుంటాం! కానీ వ్యాయామాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ చక్కగా ఓ కుక్క క్లాసులు కూడా చెప్పేస్తోంది. నమ్మడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే..! అయితే ఓ సారి ఈ వీడియో చూడండి. ఆస్ట్రేలియన్ షెప్‌యార్డ్ ఎక్సర్‌సైజులు ఎలా చేయాలో క్లాసులు చెప్తుంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. 

జనవరి 10న టెస్లా అనే కుక్క స్కిల్స్‌ను తొలిసారిగా పోస్టు చేశారు. ఆ తర్వాత ట్విటర్లో వేల కామెంట్లు రావడంతో మరిన్ని ఫీట్లను పోస్టు చేశారు. ఆస్సీస్ డూయింగ్ థింగ్స్ అనే అకౌంట్‌లో కుక్క దొర్లుతూ ఎగురుతూ క్లాస్ చెప్తుండటం చూసే వాళ్లందరికీ నవ్వు తెప్పిస్తుంది. ఈ వీడియో ట్విటర్లో 42లక్షల వ్యూయర్స్‌ను దక్కించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 92వేల మంది వీక్షించారు. టెస్లా పేరు మీదనే ఓ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌.. దానికి 40వేల మంది ఫాలోవర్లు ఉన్నారంటేనే అర్థమైపోతోంది కదా అది కూడా ఓ సెలబ్రిటీ అని. 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top