మైండ్‌ బ్లోయింగ్‌ వీడియో: అమేజింగ్‌ టెక్నిక్‌

21 Million Views For Garlic Peeling Hack That Blowing People  Minds - Sakshi

వెల్లుల్లి పొట్టు ఒలవడం ఇంత తేలికా?

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వీడియో

21 మిలియన్లకు  పైగా వ్యూస్‌

వెల్లుల్లి ఒలవడం ఎంత కష్టమో.. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా ఆవకాయల పచ్చడి పట్టేకాలంలో తెలిగింట ప్రతి ఆడబడుచుకూ ఇది అనుభవమే. అయితే సోషల్‌ మీడియా పుణ్యమా అని  వెల్లుల్లిని ఒడుపుగా ఒలిచే ప్రక్రియ ఒకటి వెలుగులోకి వచ్చింది. వెల్లుల్లిని ఒలిచేందుకు ఇదే ఉత్తమమైన పద్ధతి అంటూ ట్విటర్‌ యూజర్‌ ఒకరు వీడియోను షేర్‌ చేశారు. వెల్లుల్లిపై పొట్టును  గోరుకి నొప్పి లేకుండా.. అతి సునాయాసంగా ఒలుస్తూ ఆమె ఒక వీడియోను పోస్ట్‌ చేశారు.

ఇపుడది ఇంటర్నెట్‌ సంచలనమైపోయింది. అమేజింగ్‌ టెక్నిక్‌.. మైండ్‌ బ్లోయింగ్‌ అంటూ నెటిజన్లు అభినందనల వెల్లువ  కురిపిస్తున్నారు. కొందరైతే  ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. వాలెంతినా లార్డ్‌  చెఫ్ పోస్టు చేసిన ఈ అమేజింగ్ వైరల్ వీడియో 21 మిలియన్లపైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. అయితే ఇది సాధ్యం కావడం లేదంటూ లేటెస్ట్‌గా స్పందిస్తున్నారు. మరి మీరు కూడా ఒకసారి  ప్రయత్నించి చూడండి. 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top