పవన్‌ వాస్తవాలు మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు

YSRCP Youyh Congress President Anil Kumar Yadav Comments On Pawan Kalyan - Sakshi

సాక్షి, పులివెందుల :  జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వాస్తవాలు మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారని వైఎస్సార్‌సీపీ యూత్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హరీష్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. మంగళవారం పులివెందులలో ఆయన మాట్లాడుతూ పవన్‌ నోటికొచ్చినట్లు మాట్లాడటం సభ్యత కాదన్నారు. తిరుమలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పులు వేసుకుని వెళ్లారని పవన్‌ చెప్పడం హాస్యాస్పదమన్నారు. తన పాదయాత్ర ముగిసిన వెంటనే తిరుపతి నుంచి తిరుమలకు ఆయన పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్లిన విషయం మీడియాలో, సోషల్‌ మీడియాలో ఎంక్వయిరీ చేస్తే తెలుస్తుందన్నారు. పులివెందులలో వైఎస్‌ కుటుంబం ఇంటి ముందు నుంచి దళితులు పాదరక్షలు లేకుండా నడవాలని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. పవన్‌ కల్యాణ్‌కు, చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా పులివెందులలో ఆ విషయాన్ని బహిర్గతం చేయాలన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో ఆయన చెప్పినట్లు నడుచుకుంటున్నారన్నారు. ప్రజలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కుయుక్తులను గమనిస్తున్నారని..ఈ ఎన్నికల్లో వారికి బుద్ధి చెబుతారని ఆయన జోస్యం చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top