‘పెప్పర్‌ గ్యాంగ్‌ను వీధుల్లోకి వదిలారు’

YSRCP MP Vijaya Sai Reddy Slams Chandrababu And Gang in Twitter - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి భూముల కోసం ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. మంగళవారం ట్విటర్‌ వేదికగా చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న నాయకులు, మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలమవుతుందని అతిగా ఊహించుకుంటున్నాడని, ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లె పెప్పర్‌ గ్యాంగ్‌ను వీధుల్లోకి వదిలాడన్నారు. వీరంతా టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టులేనని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. 

‘పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జీవో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతీదీ కమిషన్లు, వాటాల కోసమే. ఎల్లో మీడియా డప్పు కొడుతూ బొక్కలు బయటపడకుండా చూసేది. దోపిడీ వ్యవహారాలు ఇప్పుడు సాక్ష్యాధారాలతో వెలుగుచూస్తుంటే కులం, కక్ష అంటూ బట్టలు చించుకుంటున్నాడు’. ‘అమరావతికి సంబంధం లేని మహిళలతో దాడులు చేయించడం, దుష్ప్రచారాలు సాగించడమా 40 ఏళ్ల అనుభవం అంటే? ప్రజలు అధికార పీఠం నుంచి విసిరి కొట్టినప్పటి నుంచి ఏదో ఒక విధ్వంసానికి కుట్ర పన్నడం తప్ప రాష్ట్రానికి మేలు చేసే పని ఒక్కటైనా చేశావా? ప్రతిపక్ష నేతవని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి’ అంటూ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్‌లలో చంద్రబాబు, ఎల్లో గ్యాంగ్‌పై దుమ్మెత్తిపోశారు. ఇక చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ దురాగతాలను విజయసాయిరెడ్డి ఎప్పటికప్పుడు తన అధికారిక ట్విటర్‌లో ఎండగడుతున్న విషయం తెలిసిందే.    
 

చదవండి:
'ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా?'
చంద్రబాబు పన్నాగంతోనే దాడి
ఇదీ.. నా కల

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top