'ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా?' | Vijaya Sai Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

'ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా?'

Feb 23 2020 1:14 PM | Updated on Feb 23 2020 1:31 PM

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను వెలికి తీసే పనిలో ఏపీ సర్కార్‌ దూకుడు పెంచిన నేపథ్యంలో చంద్రబాబు అవినీతిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా? ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్, ఈ పక్కనేమో కడప కారాగారం. నడిమధ్యనున్నది రాజమండ్రి చెరసాల... అని సోషల్ మీడియా కుర్రకారు తెగ ఊగిపోతున్నారు. పాపం అసలే ఎండాకాలం. రెండు ఏసీలేసుకుని పడుకునే వాడు. ఎలా తట్టుకుంటాడో ఏమో?' అంటూ వ్యాఖ్యానించారు.

కాగా మరో ట్వీట్‌లో.. 'దమ్ముంటే దర్యాప్తు జరిపించుకోండి. అధికారంలో ఉన్నారు కదా అని నిన్న మొన్నటి వరకు సవాళ్లు విసిరిన వారంతా కుక్కిన పేనులయ్యారు. ఏ తప్పూ చేయలేదనుకుంటే సిట్ ముందుకు వచ్చి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. పునీతులని తేలితే మిమ్మల్నెవరూ పల్లెత్తు మాట అనరు' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు. చదవండి: ఏం బతుకులు మీవి..?: విజయసాయిరెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈఎస్‌ఐ కుంభకోణంపై విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు. 'అచ్చన్న దోచుకున్న ప్రతి రూపాయిలో సగం లోకేశ్‌కు పంపించాడు. పార్టీ అండగా నిలవక పోతే డైరీలన్నీ బయటకు తీస్తానని బెదిరిస్తున్నాడట. లోకేశ్ చెబితేనే లేఖ రాశానని సన్నిహితుల వద్ద వాపోతున్నాడట. తండ్రీ కొడుకుల కనుసన్నల్లోనే కుంభకోణం జరిగింది. అందుకే అచ్చన్న ధీమాగా ఉన్నాడు' అంటూ ట్వీట్‌ చేశారు.

ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి..?

Advertisement
 
Advertisement
Advertisement