‘బాబు చేతిలో ఆ డాక్టర్‌ కీలు బొమ్మ’ | Sakshi
Sakshi News home page

‘బాబు చేతిలో ఆ డాక్టర్‌ కీలు బొమ్మ’

Published Sun, May 17 2020 2:00 PM

YSRCP MLA Umashankar Ganesh Fires On Chandrababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి అ‍య్యనపాత్రుడి చేతుల్లో డాక్టర్‌ సుధాకర్‌ కీలు బొమ్మలా మారాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ విమర్శించారు. టీడీపీ నేతల పథకం ప్రకారమే డాక్టర్‌ సుధాకర్‌ నడిరోడ్డుపై వీరంగం సృష్టించారని మండిపడ్డారు. ఇందుకోసం టీడీపీ కార్యాలయం ముందుగానే ఓ లేఖ తయారుచేసిందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే సుధాకర్‌ విషయంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ కులాన్ని లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి : ‘బాబును దళిత సమాజం ఏనాడు క్షమించదు’)

2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పాయకరావుపేట సీటు కోసం సుధాకర్‌ ప్రయత్నం చేశారని తెలిపారు. ఎమ్మెల్యే సీటు కోసం సుధాకార్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఆ లేఖను వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌కు సమర్పించారని చెప్పారు. ఎమ్మెల్యే సీటు రాకపోవడంతో వైద్య విధాన పరిషత్‌ కమిషన్‌ ఆ లేఖను ఆమోదించలేదని వివరించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత రోజే ఉద్యోగానికి రాజీనామా లేఖ సమర్పించిన సుధాకర్‌.. సీటు లభించకపోవడంతో తిరిగి ఉద్యోగంలో చేరాడని విమర్శించారు. (చదవండి : చంద్రబాబు డైరెక‌్షన్‌లో.. డాక్టర్‌ సుధాకర్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement