‘చంద్రబాబు ప్రతిపక్షనేత కాదు.. పనికిమాలిన నేత’

YSRCP MLA RK Roja Slams Chandrababu About Praja Chaitanya Yatra - Sakshi

సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షనేత కాదని పనికిమాలిన నేత అని ఏపీఐఐసీ ఛైర్మన్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా ఆయన బుద్ధి మారడం లేదని మండిపడ్డారు. బుధవారం స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్కే రోజా అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబు నాయకత్వంలోని టీడీపీ విధివాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు వస్తున్న విశేష ఆదరణను చూసి తట్టుకోలేకే చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రల పేరిట సిగ్గు లేకుండా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. బాబు ప్రజా చైతన్య యాత్రను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రోజా పేర్కొన్నారు. అంతేకాకుండా మూడు రాజధానులను వ్యతిరేకించిన చంద్రబాబు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు వారి ప్రాంతంలో తిరగనివ్వకపోగా తరిమి తరిమి కొడతారన్నారు. 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ పాలనలో చంద్రబాబు మినహా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.  ప్రస్తుతం టీడీపీకి 23 సీట్లు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో అవి కూడా ఉండవని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలల్లోనే వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీల్లో 80 శాతం అమలు చేశారన్నారు.  రైతు భరోసా కింద ప్రతి రైతు అకౌంట్‌లోకే నేరుగా సొమ్మును జమచేస్తున్నామని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ తన పిల్లలు ఏ విధంగా భోజనం చేస్తున్నారో అదేవిధంగా రాష్ట్రంలోని పేద విద్యార్థులు కూడా నాణ్యమైన భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకంలో ప్రత్యేకంగా మెనూ రూపొందించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన ప్రత్యేక మధ్యాహ్న భోజన పథకం దేశానికి ఆదర్శమన్నారు. మెనూ ప్రకారం పిల్లలకు భోజనం పెడుతుంటే ఇంతకంటే ఏం కావాలన్నారు. అమ్మ ఒడి పథకం చాలా బాగా పనిచేస్తుందని ఎమ్మెల్యే ఆర్కో రోజా అన్నారు. 

చదవండి:
'టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట'

అవ్వాతాతల కంటికి వెలుగు
‘సీఎం మామయ్యా’ అంటూ చిన్నారి ప్రసంగం..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top