‘లోకేష్‌ మాటలు వినడం మన ఖర్మ’ | YSRCP MLA Anil Kumar Yadav Fires On Nara Lokesh | Sakshi
Sakshi News home page

Aug 9 2018 4:32 PM | Updated on Aug 20 2018 6:07 PM

YSRCP MLA Anil Kumar Yadav Fires On Nara Lokesh - Sakshi

సాక్షి, గుంటూరు : 2019లో వైఎస్‌ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని వైఎస్సార్‌సీపీ నేత, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌పై నిప్పులు చెరిగారు.

‘లోకేష్‌లాంటి వారి మాటలు వినాల్సి రావడం మన ఖర్మ. లోకేష్‌ నీ కుటుంబ చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకో. వెన్నుపోటు తప్పా ముందుండి పోరాడిన చరిత్ర మీ కుటుంబానికి లేదు’  అని విమర్శించారు. ఒక్కసారి జగన్‌ సీఎం అయితే జీవితాంతం అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడనే భయం టీడీపీకి ఉందని ఎద్దేవా చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం అవుతుందని తేల్చి చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement