రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చింది బాబే: ఆర్కే  | YSRCP MLA Alla Ramakrishna Reddy Slams Chandrababu In Vanchana Pai Garjana | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చింది బాబే: ఆర్కే 

Jul 2 2018 3:33 PM | Updated on Aug 20 2018 6:07 PM

YSRCP MLA Alla Ramakrishna Reddy Slams Chandrababu In Vanchana Pai Garjana - Sakshi

సాక్షి, అనంతపురం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక హోదా ఉద్యమ సారధి అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన వంచనపై గర్జన దీక్షలో ప్రసంగిస్తూ.. చంద్రబాబు నాలుగేళ్లుగా బీజేపీని ఏమీ అనలేదని పేర్కొన్నారు. హోదా గురించి ప్రధానమంత్రి మోదీని చొక్కా పట్టుకొని అడిగే ధైర్యం బాబుకి లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో హోదాపై మాట్లాడితే మైక్‌ కట్‌ చేయించారని గుర్తుచేశారు. ప్యాకేజీలన్నీ ముఖ్యమంత్రి, మంత్రులే స్వాహా చేశారన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చింది చంద్రబాబేనని విమర్శించారు. రాజధాని పేరుతో బాబు దోపిడీ చేస్తున్నారని ఆర్కే ఆరోపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement