కేశవ్‌..ఐదేళ్లలో ప్రజల వద్దకు ఎన్నిసార్లు వెళ్లావ్‌ ?

YSRCP Members Questiong TDP MLA Payyavula Keshav About Constituency Development - Sakshi

సాక్షి, కూడేరు: పయ్యావుల కేశవ్‌..ఈ ఐదేళ్ల పాలనలో ఉరవకొండ నియోజక వర్గంలో ఎన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉన్నావని వైఎస్సార్‌సీపీ నాయకులు  ప్రశ్నించారు. బుధవారం కూడేరు మండల పరిధిలోని అరవకూరు, కమ్మూరు గ్రామాల్లో పయ్యావుల కేశవ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండడు. ఏమి అభివృద్ధి చేశాడని చేసిన వ్యాఖ్యలపై గురువారం కూడేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  వైఎస్సార్‌సీపీ నాయకులు నిప్పులు చెరిగారు. జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ. ఆ పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మాదన్న, జిల్లా కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్‌లు మాట్లాడుతూ  గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నీవు ప్రజలకు అందుబాటులో లేవని ఓటుతో ఓడించారన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక రెండేళ్ల పాటు కనిపించకుండా పోయావు.

 ఎమ్మెల్సీగా ఎంపికయ్యాక  కొద్గి రోజులకు నియోజక వర్గ కేంద్రానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నావు. కాని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం, అధికారులతో పోరాటాలు చేశాడని అన్నారు8. ఈ విషయం నియోజకవర్గ ప్రజలందరికి తెలుసన్నారు.  నీ మాదిరి ఎమ్మెల్యే గిమ్మిక్కు రాజకీయాలు చేయడన్నారు. కూడేరు మండలంలో ముద్దలాపురం, ఇప్పేరు చెరువులకు నీటి విడుదల కోసం ఎమ్మెల్యే ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసింది తేదీలతో సహా చూపిస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అడ్డంకిగా మారిన నీకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.  ఈ సమావేశంలో నాయకులు తోపుదుర్తి రామాంజనేయులు, క్రిష్టప్ప, సంగప్పతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top