‘మహానాడు కాదు..మహాదగానాడు’

YSRCP Leader TJR Sudhakar Babu Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళిత వ్యతిరేకి అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఆరోపించారు. దళితుల పట్ల చంద్రబాబు చాలాసార్లు అక్కసు వెళ్లగక్కారని విమర్శించారు. మహానాడులో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ఎందుకు తీర్మాణాలు చేయలేదని ప్రశ్నించారు. అది మహానాడు కాదు మహా దగానాడు అని ఎద్దేవా చేశారు.

దళితుడన్న కారణంతోనే మోత్కుపల్లి నర్సింహులుని టీడీపీ నుంచి బహిష్కరించారని ఆరోపించారు. దళితుల పట్ల మంత్రి ఆదినారాయణ రెడ్డి అవహేళనగా మాట్లాడినా, వర్ల రామయ్య పబ్లిగ్గా విద్యార్థిని తిట్టినా చంద్రబాబు వివరణ కూడా అడగలేదని మండిపడ్డారు. రాజధాని పేరుతో భూములు స్వాహా చేశారని సుధాకర్‌ బాబు ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top