ఆ నిర్ణయం వైఎస్సార్‌ సీపీ విజయం: సుధాకర్‌ బాబు | YSRCP Leader Sudhakar Babu Comments On TDP | Sakshi
Sakshi News home page

ఆ నిర్ణయం వైఎస్సార్‌ సీపీ విజయం: సుధాకర్‌ బాబు

Jan 12 2019 1:26 PM | Updated on Jan 12 2019 4:37 PM

YSRCP Leader Sudhakar Babu Comments On TDP - Sakshi

ఇచ్ఛాపురం ముగింపు సభతో టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు.వైఎస్సార్ సీపీకి భయపడి చంద్రబాబు..

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న పింఛన్‌ పెంపు నిర్ణయం వైఎస్సార్‌ సీపీ విజయంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత సుధాకర్‌ బాబు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని అన్నారు. టీడీపీ నాయకులు ఇసుక, మట్టి, భూ మాఫియా చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర దళిత, పీడిత జనానికి మనో ధైర్యం నింపిందని చెప్పారు.

ఇచ్ఛాపురం ముగింపు సభతో టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. వైఎస్సార్ సీపీకి భయపడి చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని పార్టీ టీడీపీ అంటూ మండిపడ్డారు. పోలవరంలో అడ్డగోలుగా దోపిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్‌ సమిట్‌పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement