పవన్‌ కల్యాణ్‌పై ఎంవీఎస్‌ ఫిర్యాదు

YSRCP Leader MVS Nagi Reddy Complains Against Janasena Chief Pawan Kalyan To AP EC - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి కలిశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ పవన్‌ కల్యాణ్‌పై ఫిర్యాదు చేశారు.  రెండు మూడు రోజులుగా నియమావళికి విరుద్ధమైన పదాలు వాడుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్న పవన్‌ కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.

హెరిటేజ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ ట్రస్టు ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా డబ్బు పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఆ విషయాన్ని కూడా ట్రస్ట్‌ అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసిందని తెలిపారు. ఆ ఆధారాలను ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ఎన్నికల ప్రధానాధికారికి సమర్పించారు. అలాగే వైఎస్సార్‌సీపీపై సోషల్‌ మీడియాలో చేస్తోన్న అసత్య ప్రచారాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు నాగిరెడ్డి తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top