దృష్టి ఫ్యాన్‌పై ఉండాలి.. వేలు స్విచ్‌పై ఉండాలి | YSRCP Leader And Comedian Ali Election Campaign At Gajuwaka | Sakshi
Sakshi News home page

దృష్టి ఫ్యాన్‌పై ఉండాలి.. వేలు స్విచ్‌పై ఉండాలి

Apr 4 2019 7:26 AM | Updated on Apr 4 2019 7:26 AM

YSRCP Leader And Comedian Ali Election Campaign At Gajuwaka - Sakshi

పాత గాజువాక జంక్షన్‌లో ప్రసంగిస్తున్న సినీ నటుడు అలీ 

గాజువాక : ‘ఈనెల 11వ తేదీని అందరూ గుర్తు పెట్టుకోండి. ఆ రోజు మాత్రం మనందరి దృష్టి ఫ్యాన్‌ గుర్తుపై ఉండాలి. మన వేలు ఈవీఎం స్విచ్‌పై ఉండాలి’ అని సినీ నటుడు అలీ అన్నారు. వైఎస్సార్‌సీపీ గాజువాక అభ్యర్థి తిప్పల నాగిరెడ్డికి మద్దతుగా ఆయన గాజువాకలో బుధవారం ప్రచారం నిర్వహించారు. నాగిరెడ్డితో కలిసి తొలుత పాతగాజువాక జంక్షన్‌ 60 అడుగుల రోడ్డులోను, అజీమాబాద్‌ కాలనీలోనూ ప్రసంగించారు. ముస్లిం మైనార్టీల కోసం దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్సార్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని పేర్కొన్నారు. గాజువాక ప్రజల సంక్షేమం కోసం నాగిరెడ్డి విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారని, అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రతి ఒక్క ముస్లిం వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. విశాఖ ఎంపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణను గెలిపించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement