కడప జడ్పీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత

YSRCP And TDP Involved In Heated Exchange At Kadapa ZP Meeting - Sakshi

సాక్షి, వైఎస్సార్‌జిల్లా : కడప జిల్లా పరిషత్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశానికి సంబంధం లేని ఆప్కో ఛైర్మన్‌ హాజరు కావడం పట్ల వైస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్త చేశారు. వేదికపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ప్లకార్డులతో వేదిక వద్ద నిరసనకు దిగారు.

కరువుపై సమాధానం చెప్పాలంటూ మంత్రులు సోమిరెడ్డి, ఆది నారాయణ రెడ్డిలను నిలదీశారు. నెలరోజుల క్రితం పంటలను పరిశీలించిన మంత్రి ఏమి చర్యలు తీసుకున్నారని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.  కాగా చర్చను అడ్డుకుంటున్నారని సోమిరెడ్డి ఎదురుదాడికి దిగారు. దీంతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు, ఇరు వర్గాల వారికీ నచ్చజెప్పి ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top