చారిత్రక ఘట్టంపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ | YS Jagan Tweet On 3000 KM Milestone | Sakshi
Sakshi News home page

Sep 24 2018 5:42 PM | Updated on Sep 24 2018 6:19 PM

YS Jagan Tweet On 3000 KM Milestone - Sakshi

ప్రజాభిమానం దన్నుతో పాదయాత్రలో చారిత్రక ఘట్టాన్ని లిఖించినందుకు వైఎస్‌ జగన్‌ హర్షం ప్రకటించారు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాసంకల్పయాత్రలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించడం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజాభిమానం దన్నుతో పాదయాత్రలో చారిత్రక ఘట్టాన్ని లిఖించినందుకు హర్షం ప్రకటించారు. తన ఆనందాన్ని ట్విటర్‌ ద్వారా వ్యక్త పరిచారు.

‘ఈరోజు మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలతో కలిసి పాదయాత్ర చేయడం గొప్ప అనుభూతి. నా మీద మీరు చూపించిన ప్రేమ, విశ్వాసం ప్రతిరోజు ప్రేరణ’గా నిలుస్తుందని వైఎస్‌ జగన్ ట్వీట్‌ చేశారు. కాగా, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని జననేత దాటారు.

Advertisement
 
Advertisement
Advertisement