అలాంటి వ్యక్తిని పొరపాటున కూడా ఎన్నుకోకూడదు: వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 21 2017 4:27 PM

YS jagan speech at bethamcharla - Sakshi - Sakshi

సాక్షి, బేతంచర్ల (కర్నూలు జిల్లా): ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ఈ నాలుగేళ్లలో ఎన్నో దారుణాలు, మోసాలు చేస్తూ.. అబద్ధాలు చెప్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, ఇలాంటి వ్యక్తిని మళ్లీ పొరపాటున కూడా ఎన్నుకోవద్దని, ఒకవేళ ఎన్నుకుంటే విశ్వసనీయత అనే పదానికి అర్థం, రాజకీయ వ్యవస్థకు విలువ ఉండవని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 14వ రోజు మంగళవారం సాయంత్రం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బేతంచర్ల చేరుకున్నారు. బేతంచర్లలో పెద్దసంఖ్యలో ప్రజలు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తూ.. చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు.

వ్యవస్థకు విశ్వసనీయత తీసుకురావాలి
‘ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థ మారకపోతే అవహేళనకు గురవుతుంది. పదవుల కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చి.. ప్రజలను ఇలాగే మోసం చేస్తూ ఉంటారు. దీనికి వ్యతిరేకంగా వ్యవస్థలో చైతన్యం రావాలి. చంద్రబాబు లాంటి వ్యక్తులను వదిలేస్తే.. మళ్లీ అధికారం కోసం రేప్పొద్దున ప్రతి ఇంటికి కేజీ బంగారం, ప్రతి ఇంటికి మారుతి కారు కొనిస్తానని నమ్మబలుకుతాడు. ఇలాంటి వ్యక్తులను, మోసాలను వ్యవస్థ నుంచి తరిమేయాలి. విశ్వసనీయతకు అర్థం తీసుకురావాలి’అని పేర్కొన్నారు. 

బేతంచర్ల.. హృదయపూర్వక కృతజ్ఞతలు

  • ఈ రోజు కొన్నివేలమంది నాతో పాటు అడుగులో అడుగువేస్తూ.. ఇవాళ బేతంచర్ల మీటింగ్‌లో పాలుపంచుకుంటున్నారు.
  • ఈ తీక్షణమైన ఏండలో నిలుచుని ఉండాల్సిన అవసరం ఏ ఒక్కరికీ లేదు
  • అయినా తీక్షణమైన ఎండను సైతం లెక్కచేయకుండా, నడిరోడ్డు అని ఖాతరుచేయకుండా చిక్కటి చిరునవ్వుతో ప్రేమానురాగాలను, ఆప్యాయతలను పంచిపెడుతున్నారు
  • మీ అందరి ఆత్మీయత అనురాగాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా..


నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో..

  • చంద్రబాబు పాలన మొదలై 4 ఏళ్లు కావొస్తుంది.. మరో సంవత్సరంలో ఎన్నికలు జరుగుతున్నాయి
  • అక్టోబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తల సమావేశంలో బాబే చెప్పారు
  • చంద్రబాబు నాలుగేళ్ల పాలన చూసిన తర్వాత అడుగుతున్నాం
  • మనకు ఎలాంటి నాయకుడు, ఎలాంటి ముఖ్యమంత్రి కావాలి అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి
  • సినిమాల్లో హీరోనే నచ్చుతాడు.. అబద్ధాలు చెప్పే, మోసం చేసే, వెన్నుపొటు పొడిచే విలన్‌ నచ్చడు.
  • 14 రీళ్ల సినిమాలో దాదాపు 13రీళ్లు హీరో కష్టాలు పడుతాడు. కానీ న్యాయంగానే ఉంటాడు. అటువంటి హీరో నచ్చుతాడు
  • సినిమా తీసుకున్నా, మహాభారతం, రామాయణం, ఖూరాన్‌ తీసుకున్నా.. అంతిమంగా నిజాయితీగా, న్యాయంగా ఉన్న వ్యక్తే గెలుస్తాడు
  • 13 రీళ్ల వరకు విలన్‌ చెలరేగుతూ.. పైచేయి సాధించినా. చివరి రీల్‌ క్లైమాక్స్‌లో మాత్రం హీరోను దేవుడు ఆశీర్వవదిస్తాడు. ప్రజలు తోడుగా ఉంటారు. హీరో విలన్‌ను పుట్‌బాల్‌ ఆడుకుంటాడు.

ఈ విషయాలు గుర్తున్నాయా బాబూ..!

  • ఎన్నికల్లో గెలిచేందుకు, ఓట్లు వేయించుకునేందుకు చంద్రబాబు ఆనాడు చెప్పిన విషయాలు గుర్తుచేసుకోవాలి
  • ఆనాడు అన్న మాటలు ఏమిటి? ఇదే చంద్రబాబు ప్రతి పేదవాడికి మూడుసెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని అన్నాడు
  • నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా.. ఇదే బాబు పాలనలో ఒక్క ఇళ్లన్న కట్టించాడా? లేదు
  • ఇవాళ ఇళ్ల కోసం అర్జీలు  పెట్టుకుంటూ ప్రజలు కాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకునే నాథుడు లేడు
  • నాన్నగారి సువర్ణ పాలనలో ఇదే డోన్‌ నియోజకవర్గంలో 30500 ఇళ్లు ఇచ్చారు.
  • ఇవాళ చంద్రబాబు పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు
  • నాలుగేళ్ల కిందట రేషన్‌ షాపులకు వెళితే.. బియ్యం, చక్కెర, కిరోసిన్‌, గోధుమపిండి, కందిపప్పు, చింతపండు, పామాయిల్‌ దొరికేవి.
  • ఇప్పుడు రేషన్‌ షాపులో ఒక్క బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు
  • నాలుగేళ్ల కిందట కరెంటు బిల్లు చాలా తక్కువగా వచ్చేది. 
  • ఇవాళ నాలుగేళ్ల పాలనలో వెయ్యి, 500, 600 కరెంటు బిల్లు వస్తుందని ప్రజలను అడిగి తెలుసుకొని చెప్పారు
  • కరెంటు బిల్లు తగ్గిస్తానని చంద్రబాబు మాట ఇచ్చి.. ఇవాళ మోసం చేశారు
  • ఎన్నికల సమయంలో బాబు ఎవ్వరినీ వదిలిపెట్టలేదు
  • జాబు రావాలంటే బాబు రావాలని అని చెప్పాడు
  • జాబు రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు
  • ప్రతి ఇంటికీ చంద్రబాబు రూ. 90 వేల చొప్పున బాకీ ఉన్నాడు
  • బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నాడు
  • వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే బాబు రావాలన్నాడు
  • బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వచ్చిందా? రాలేదు
  • బాబు అమలుచేసిన రుణమాఫీ పథకం రైతుల వడ్డీలకు కూడా సరిపోలేదు
  • ఆడవాళ్లను మోసం చేయడానికి ఎవరైనా వెనుకాడతారు
  • ఆడవాళ్ల కళ్లలో నీళ్లు చూడకూడదని భావిస్తారు.
  • కానీ ఇదే చంద్రబాబు.. మీ పొదుపు రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నాడు
  • నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా.. ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా? కాలేదు
  • ఇన్ని  దారుణాలు, అబద్ధాలు, మోసాలు చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు
  • మళ్లీ ఇలాంటి వ్యక్తిని పొరపాటున కూడా ఎన్నుకోకూడదు


ఇవాళ డోన్‌ నియోజకవర్గం పరిస్థితి ఏంటి?

  • నియోజకవర్గంలో బేతంచర్లతోపాటు పలు ప్రాంతాల్లో నాపరాయి, కలర్‌ స్టోన్‌ పరిశ్రమలు చాలా ఉన్నాయి
  • ఒక్కో నాపరాయి పాలిషింగ్‌ యూనిట్‌ పెడితే 25మందికి ఉద్యోగాలు వస్తాయి
  • నాపరాయి పరిశ్రమలు పెట్టుకొని ఇక్కడ చాలామంది ఉపాధి పొందుతున్నారు
  • బాబు అనాలోచిత పాలన వల్ల ఇక్కడి పరిశ్రమలు దెబ్బతింటున్నాయి
  • బాబు సీఎం రాకముందే కరెంటు బిల్లు యూనిట్‌కు రూ. 3.75 ఉండేది
  • యూనిట్‌కు నాలుగు రూపాయలు ఉన్న చార్జీలను దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో రూ. 3.75 లకు తగ్గించారు.
  • కానీ, బాబు సీఎం అయ్యాక యూనిట్‌ విద్యుత్‌ చార్జీని ఏకంగా ఎనిమిది రూపాయలకు పెంచారు
  • ఇక ఏ రకంగా ఇక్కడి పరిశ్రమలు బతుకుతాయి? ఏ రకంగా ప్రజలు బతుకుతారు?
  • సీవరేజ్‌ చార్జీలు రూ. 18 నుంచి రూ. 55కు పెంచాడు. రాయల్టీలను గణనీయంగా పెంచారు
  • దీంతో ఇక్కడ ఉన్న ఐదారు వందల పాలిషింగ్‌ యూనిట్లలో సగం మూతపడే పరిస్థితి వచ్చింది
  • నాపరాయి పరిశ్రమ ఆధరంగా ఇక్కడ ఉపాధి పొందుతున్న వాళ్లలో ఎక్కువమంది బీదవాళ్లు, ఎస్సీలు
  • కానీ చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, పాలన, కారణంగా పరిశ్రమలు మూతపడి..
    ఇక్కడ 20వేలమంది బీద కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది 
  • ఇక్కడి పరిశ్రమలను కాపాడుకోవడం తెలియని చంద్రబాబు మళ్లీ..
    తాను సింగపూర్‌, జపాన్‌, చైనా నుంచి పరిశ్రమలు, పెట్టుబడులు తెస్తానంటూ బడాయి చెప్తున్నారు
  • కొత్తవి కథ దేవుడి ఎరుగు ఉన్నవి మూతపడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు
  • డోన్‌ నియోజకవర్గంలో ఒక్క ఎకరం సాగు కూడా లేదు
  • గ్రామాలకు తాగునీరు లేదు. నాన్నగారి పాలనలో డోన్‌ ప్రాంతానికి, డోన్‌ టౌన్‌కు
    నీళ్లు ఇవ్వాలని రూ. వంద కోట్లతో గాజులదిన్నె నుంచి పైప్‌లైన్‌ ద్వారా నీళ్లు ఇచ్చారు
  • కేఈ కృష్ణమూర్తి ఇక్కడ ఎన్నోసార్లు గెలిచారు
  • అవుకు నుంచి నీళ్లు పంపు చేసి ఈ ప్రాంతానికి ఇస్తానని కేఈ హామీ ఇచ్చాడు.
  • కానీ ఆ పెద్దమనిషి ఇచ్చిన హామీని సైతం చంద్రబాబు పట్టించుకోవడం లేదు
  • సాగుకు, తాగడానికి నీళ్లు లేక ఇక్కడ రైతులు, ప్రజలు అల్లాడుతున్నా.. పట్టించుకునే నాథుడు లేడు

చంద్రబాబు కూడా ఒక దళారి 

  • లక్షకుపైగా పెట్టుబడి పెట్టి ఉల్లి పంట పండిస్తున్నా కనీస గిట్టుబాటు ధర రావడం లేదు 
  • దీంతో ఉల్లి పంటను చేనులోనే వదిలేసి.. వ్యవసాయం దండుగ అనే పరిస్థితి రైతులకు చంద్రబాబు కల్పించారు
  • ఈ ప్రాంతంలో టమోట పంట బాగా పండుతోంది. కానీ ఇంతవరకు ఇక్కడ కోల్డ్‌ స్టోరేజ్‌ లేదంటే
    చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు
  • శనగ, మినుము, మిర్చి, కంది.. ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు
  • దళారులు, హెరిటేజ్‌ సంస్థ రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ఆ తర్వాత ధర పెంచుకొని అమ్ముతున్నారు
  • మినుముకు రైతులకు క్వింటాలుకు రెండువేలు ఇస్తే.. అదే హెరిటేజ్‌లో క్వింటాల్‌ పదివేలకు అమ్ముకుంటున్నారు
  • చంద్రబాబు కూడా ఒక్క దళారి కావడం వల్లే రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులు నష్టపోతున్నారు.
  • హెరిటేజ్‌ లాభాల కోసం రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు పంటలు కొనుగోలుచేసి..
    ఆ తర్వాత ఎక్కువ రేటుకు హేరిటేజ్‌ తమ దుకాణాల్లో అమ్ముకుంటోంది. గత నాలుగు సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది

ఎలాంటి ఆపరేషన్‌నైనా ఉచితంగా వైద్యం చేయించి..చిరునవ్వుతో పంపిస్తాం

Advertisement
Advertisement