
సాక్షి, నరసాపురం : ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుం నియోజకవర్గంలో రైల్వేగేటు దగ్గర 2200 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆ ప్రాంతంలో ఒక మొక్కను నాటారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.