‘షర్మిలమ్మా... నిన్ను మిస్సవుతున్నానమ్మా’ | YS Jagan Mohan Reddy Greetings on Rakshabandhan | Sakshi
Sakshi News home page

Aug 26 2018 10:47 AM | Updated on Aug 27 2018 11:37 AM

YS Jagan Mohan Reddy Greetings on Rakshabandhan - Sakshi

గత ఏడాది రక్షాబంధన్‌ సందర్భంగా వైఎస్‌ జగన్‌కు రాఖీ కడుతున్న షర్మిల

సాక్షి, హైదరాబాద్‌ : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెమ్మలందరికీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమై ఉండటంతో ఈసారి రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెలు షర్మిలను మిస్‌ అవుతున్నానని ఆయన ట్వీట్‌ చేశారు. షర్మిలకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ‘మిస్సింగ్‌ యూ ఆన్‌ రాఖీ.. షర్మీపాప.. బ్లెసింగ్స్‌ ఆల్వేస్‌’ అంటూ ఆప్యాయంగా పేర్కొన్నారు.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం ఉదయం విశాఖ జిల్లా ధారభోగాపురం వద్ద వైఎస్‌ జగన్‌ రక్షాబంధన్‌ వేడుకల్లో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజాతోపాటు పలువురు మహిళా నేతలు ఆయనకు రాఖీలు కట్టారు. జననేత జగనన్నకు మిఠాయిలు తినిపించి.. ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. వైఎస్‌ జగనన్నకు రాఖీ కట్టినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పారు.  వైఎస్‌ జగన్‌ సీఎం కావాలని ప్రతి మహిళ కోరుకుంటోందని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement