341వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | YS Jagan 341st Day Praja Sankalpa Yatra Started | Sakshi
Sakshi News home page

341వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Jan 9 2019 8:36 AM | Updated on Jan 9 2019 9:46 AM

YS Jagan 341st Day Praja Sankalpa Yatra Started - Sakshi

జననేత 341వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గం.. కవిటి మండలంలోని కొత్త కొజ్జీరియా నుంచి ప్రారంభించారు.

సాక్షి, శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 341వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గం.. కవిటి మండలంలోని కొత్త కొజ్జీరియా నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ఇచ్ఛాపురం మండలం అ‍య్యవారి పేట, లొద్దపుట్టి మీదుగా, పేటూరు, ఇచ్ఛాపురం వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తారు. మధ్యాహ్నం ఇచ్ఛాపురం వద్ద జననేత ప్రజాసంకల్పయాత్ర పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం ఇచ్ఛాపురం పాతబస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.




 

Advertisement
 
Advertisement
Advertisement