‘ఇచ్చిన మాట ప్రకారం పవన్‌ సినిమా చేస్తున్నాడు’ | That is Why Pawan Kalyan is Making A Film : Minister Balineni Srinivasa Reddy | Sakshi
Sakshi News home page

‘ఇచ్చిన మాట ప్రకారం పవన్‌ సినిమా చేస్తున్నాడు’

Nov 7 2019 3:33 PM | Updated on Nov 7 2019 6:40 PM

That is Why Pawan Kalyan is Making A Film : Minister Balineni Srinivasa Reddy - Sakshi

సాక్షి, ప్రకాశం : ఇసుక సమస్యపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసింది లాంగ్‌ మార్చ్‌ కాదు రాంగ్‌ మార్చ్‌ అని మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే అప్పుడు పవన్‌ కల్యాణ్‌ చోద్యం చూశాడని విమర్శించారు. చంద్రబాబు అడుగుజాడల్లో నడిచే పవన్‌కు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇంకా అర్థం కావట్లేదన్నారు. విశాఖ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచిగా పరిపాలిస్తే తాను సినిమాలు చేసుకుంటానంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసిన బాలినేని, జగన్‌ పాలన బాగుంది కాబట్టే ఆయన ఇప్పుడు సినిమా మొదలు పెడుతున్నాడని వ్యాఖ్యానించారు. 

Advertisement
 
Advertisement
Advertisement