‘బలమైన ప్రతిపక్షంగా నిలవాలని భావిస్తున్నాం’

We Expect To Stand Strong Opposition Party In AP Said By BJP Leader Muralidhar rao - Sakshi

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులలో మా పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిలవాలని భావిస్తున్నామని, ఇప్పటి నుంచి ఆ దిశగా అడుగులేస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు వ్యాఖ్యానించారు. విజయవాడలో మురళీధర్‌ రావు విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలని అన్ని ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. దేశ వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని అన్నారు.

జూలై 6 నుంచి జాతీయ స్థాయిలో కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో  జూలై 30 కల్లా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఉన్న దానికన్నా 20 శాతం సభ్యత్వ నమోదు పెంచుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. ఇందుకు తగ్గట్టుగానే టీమ్‌ ఎంపిక జరుగుతుందని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top