ఆజం ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు | We Are Paying The Price For Staying In India Says Azam Khan | Sakshi
Sakshi News home page

ఆజం ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

Jul 20 2019 10:42 AM | Updated on Jul 20 2019 10:52 AM

We Are Paying The Price For Staying In India Says Azam Khan - Sakshi

లక్నో: వివాదాస్పద నేత, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజం ఖాన్‌ ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్ర వచ్చినప్పటి (1947) నుంచి భారతదేశంలో నివశించడానికి తాము (ముస్లింలు) డబ్బులు చెల్లిస్తున్నామని వ్యాఖ్యానించారు. ‘‘దేశ విభజన అనంతరం మా పూర్వీకులు చాలామంది పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌కు తరలివెళ్లిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఇక్కడే ఉన్నారు. వారందరికీ ఇక్కడ తగిన శిక్ష పడుతోంది. ఇక్కడ నివశించడానికి మేం డబ్బులు చెల్లిస్తున్నాం’’ అని అన్నారు. అయితే శుక్రవారం బిహార్‌లో మూకదాడి జరిగిన విషయం తెలిసిందే. సరాన్‌ జిల్లాలో గేదెను దొంగిలించబోయారన్న కారణంతో జరిగిన ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. దీనిపై స్పందించి ఆజం ఖాన్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

దాడిలో సంఘటనా స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారని ఎస్పీ హర్‌కిషోర్‌ తెలిపారు. ఇద్దరుముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించామని తెలిపారు. మరోవైపు దొంగిలించే ప్రయత్నం చేయకపోయినా, కావాలనే కొట్టి చంపారని మృతుల బంధువులు ఆరోపించారు. దీనిపై బిహార్‌ వ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఘటనపై ఆజం ఖాన్‌ చేసిన వ్యాఖ‍్యలు దేశ సమగ్రతకు వ్యతిరేకంగాఉన్నాయంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కాగా ఖాన్‌పై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే పలు కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న ల్యాండ్‌మాఫీయాను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలుచేపట్టింది. దీనిలోభాగంగా మాఫియా నేరారోపణలు ఎదుర్కొంటున్న పాల్పడిన అనేక మంది నేతలపై కేసులను నమోదు చేస్తోంది. ఆ జాబితాలో ఆజం ఖాన్‌ పేరును కూడా చేర్చింది. కేసులో నేరం రుజువైతే ఆయనను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. కాగా ఆయనపై గత పదేళ్లలో వివిధ నేరాల్లో 30కిపైగా కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement