పుకార్ల హత్యలు.. ఆనందంలో త్రిపుర : సీఎం | Wave Of Happiness In Tripura Says CM On Lynching | Sakshi
Sakshi News home page

పుకార్ల హత్యలు.. ఆనందంలో త్రిపుర : సీఎం

Jul 6 2018 6:53 PM | Updated on Jul 6 2018 6:53 PM

Wave Of Happiness In Tripura Says CM On Lynching - Sakshi

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌

అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అనుమానితులుగా కనిపిస్తే మూకుమ్మడిగా దాడి చేస్తున్న ఘటనలపై మీరేంమంటారు? అని విప్లవ్‌ను మీడియా ప్రతినిధులు అడుగ్గా.. రాష్ట్రం ఆనందంలో ఉందని సమాధానం ఇచ్చారు. ‘నా ముఖం చూడండి. ఆనందంతో ఎంతలా వెలిగిపోతోందో’ అచ్చూ నాలానే రాష్ట్రంలోని ప్రజలు ఆనందంతో ఉన్నారని విప్లవ్‌ పేర్కొన్నారు.

అయితే, ఆ తర్వాత నోరు జారానని తెలుసుకున్న సీఎం తప్పుగా అర్థం చేసుకోవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. అగర్తల విమానాశ్రయాన్ని ఉద్దేశించి అన్నానని వివరణ ఇచ్చారు. ఈ ఎయిర్‌పోర్టుకు ఇటీవల ‘మహారాజా వీర్ విక్రమ్ మాణిక్య కిశోర్ ఎయిర్‌పోర్టు’గా నామకరణం చేశారు. గత నెల 28న త్రిపురలో మూడు ‘మాబ్ లించింగ్’ (కొట్టి చంపడం) ఘటనలు జరిగాయి. పిల్లల కిడ్నాపర్లుగా భావించి ఇద్దరిని, కిడ్నీ స్మగ్లర్ల్‌గా అనుమానించి కొట్టి చంపారు.

Advertisement
 
Advertisement
Advertisement