వేదికపైనే తిట్టుకున్న జగదీష్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌

War Of Words Between Jagadish Reddy And Uttam Kumar Reddy - Sakshi

సాక్షి, నల్గొండ: తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశంలో ఇద్దరు నేతలు మధ్య పరస్పర విమర్శలకు దిగారు. రైతు రుణమాఫీ విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగగా... వేదికపైనే నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ మాటల యుద్దానికి తెరలేపారు. ‘నువ్‌ పీసీసీ చీఫ్‌గా ఉండడం మీ సొంత ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు’ అని ఉత్తమ్‌కుమార్‌పై మంత్రి జగదీష్‌ సెటైర్‌ వేయగా.. ‘నువ్‌ మంత్రిగా ఉండడం జిల్లా ప్రజల దురదృష్టం’ అంటూ మంత్రికి ఉత్తమ్ కౌంటర్ వేశారు.
(చదవండి: కరోనా: తెలంగాణలో ఒక్కరోజే 199 కేసులు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top