
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉన్న చంద్రబాబు తన నమ్మకస్తులను పంపి ఆహ్వానం సంపాదించేవారని విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏలో లేపోయినా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి వెళ్లే దమ్ము ఆయనకు లేదన్నారు. బీజేపీ పెద్దల కంట్లో పడితే పాత కేసులు ఎక్కడ తిరగతోడుతారో అని బాబు వణుకుతున్నారని తెలిపారు. అప్పట్లో గిరగిరా తిప్పిన చక్రాలు ఏమయ్యాయో అని ఎద్దేవా చేశారు.
అలాగే చంద్రబాబు అనుకూల మీడియాను ఉద్దేశించి కూడా విజయసాయిరెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. బాబు సీఎంగా లేకపోవడంతో కిరసనాయిలు.. ఆంధ్రప్రదేశ్ నాశనం కావాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గంటన్నరసేపు సమావేశమై రాష్ట్ర సమస్యలపై చర్చిస్తే.. పీపీఏలపై మోదీ మందలించాడని తప్పుడు వార్తలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న భజన పరాకాష్టకు చేరిందన్నారు.
ఏ రాష్ట్రంలో సిఎం ప్రమాణ స్వీకారం ఉన్నా నమ్మకస్థులను పంపి ఇన్విటేషన్ సంపాదించేవాడు. ఎన్డీయేలో లేకున్నా ఇప్పుడు కేజ్రీవాల్ పదవీ ప్రమాణానికి వెళ్లే దమ్ము లేదు. బిజెపి పెద్దల కంట్లో పడితే పాత కేసులు ఎక్కడ తిరగతోడతారో అని వణుకుతున్నాడు. అప్పట్లో గిరగిరా తిప్పిన చక్రాలు ఏమయ్యాయో?
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 13, 2020