‘కుల పెద్దకు శరణ్యమన్నాడు. ఎవరిని నమ్మాలి’

Vijaya Sai Reddy Satires On AP Election Commissioner And Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనాను సాకుగా చూపుతూ స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన ఎస్‌ఈసీ తీరుపై ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘న్యాయమూర్తిలా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన వ్యక్తి.. కుల పెద్దకు శరణ్యమన్నాడు. ఇక ఎవరిని నమ్మాలి. ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి జీతభత్యాలు తీసుకుంటూ ఊడిగం చేయడమేంటి? కరోనా సాకుగా దొరికిందా? నియంత్రించాలని ప్రభుత్వానికి చెప్పాల్సిందిపోయి.. అడ్డంగా పడుకుంటే ఆగుతుందా?’అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 
(చదవండి: ‘అలా అయితే ముఖ్యమంత్రి ఎందుకు?’)

మరో ట్వీట్‌లో.. ‘బాబూ... ఆరు వారాలు కాదు, 60 వారాల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగినా నీ అడ్రసు గల్లంతవక తప్పదు. వ్వవస్థల్లో నీ మనుషులున్నారు కదా అని ఎలక్షన్లు నిలిపి వేయించావ్. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 5 వేల కోట్ల నిధులు రాకుండా చేసి ఐదు కోట్ల మంది ప్రజలకు ద్రోహం చేశావు. నీ నీచ రాజకీయాల  చరమాంకానికి నువ్వే దారి వేసుకున్నావ్’అని చంద్రబాబు తీరుపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 
చదవండి:► 
ఎన్నికల కమిషనర్‌ను వివరణ కోరిన గవర్నర్‌
హైకోర్టులో దాఖలైన లంచ్‌మోషన్‌ పిటిషన్‌
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top