హైకోర్టులో దాఖలైన లంచ్‌మోషన్‌ పిటిషన్‌

Lunch Motion Petition Filed In High Court On AP Local Elections - Sakshi

షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని కోరుతూ వ్యాజ్యం

లంచ్‌ విరామం తరువాత విచారణ

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత వాయిదా వేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. నెల్లూరుకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. లంచ్‌ విరామం అనంతరం విచారణ చేపడతామని తెలిపింది. కాగా ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని కోరుతూ గతంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా.. మార్చి 31లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

కాగా కరోనాను సాకుగా చూపుతూ ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించే విధంగా ఈసీకి ఆదేశాలు ఇ‍వ్వాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే గవర్నర్‌ను కోరారు. దీనిపై గవర్నర్‌ ఈసీని వివరణ సైతం అడిగారు. ఈ నేపథ్యంలో లంచ్‌మోషన్‌ పిటిషన్‌​ దాఖలు కావడంతో హైకోర్టు తీర్పుపై ప్రాధాన్యత సంతరించుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top