చంద్రబాబు ఏం సాధించారు?: వెలంపల్లి | Vellampalli Srinivas Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఏం సాధించారు?: వెలంపల్లి

Jan 23 2020 10:24 AM | Updated on Jan 23 2020 12:15 PM

Vellampalli Srinivas Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ: శానసమండలిలో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ..‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు పార్టీలకతీతంగా వ్యవహరించాలి. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. బిల్లులను అడ్డుకుని చంద్రబాబు ఏం సాధించారు?. చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని మండలి చైర్మన్‌ను ప్రభావితం చేశారు. టీడీపీ సభ్యులు కూడా మండలి చైర్మన్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. టీడీపీ సభ్యులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. చంద్రబాబు కనుసన్నల్లో చైర్మన్‌ వ్యవహరించారు. తాను చేసేది తప్పు అని మండలి చైర్మన్‌ ఒప్పుకున్నారు. 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశించారు. చట్ట సభలపై గౌరవం లేకుండా  టీడీపీ వ్యవహరించింది’ అని మండిపడ్డారు.

చదవండి: 
మండలిలో రౌడీయిజం చేశాం..

హద్దులు దాటిన అరాచకం

ఇది తప్పే..

Advertisement
 
Advertisement
Advertisement