నయీమ్‌ డబ్బులతో టీఆర్‌ఎస్‌ ప్రచారం

V Hanumantha Rao Slams On KCR Nizamabad - Sakshi

నిజామాబాద్‌అర్బన్‌: నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ అనంతరం భారీగా డబ్బులతో పాటు బంగారాన్ని సీఎం కేసీఆర్‌ దోచుకున్నారని, ఆ డబ్బునే ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ హన్మంత్‌రావు ఆరోపించారు. కేసీఆర్‌ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మహా కూటమియే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేత మహేశ్‌కుమార్‌గౌడ్‌ తల్లి మణెమ్మ మృతి చెందడంతో ఆయనను పరామర్శించేందుకు ఆదివారం నిజామాబాద్‌కు వచ్చిన వీహెచ్‌ ఓ హోటల్‌లో విలేకరుల తో మాట్లాడారు.

ముందస్తు ఎన్నికలకు కాం గ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని, మహా కూటమి సీట్ల సర్దుబాటు త్వరలోనే పూర్తవుతుందన్నా రు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేసీఆర్‌ విఫలమయ్యాడని, తన కుటుంబంలోని సమ స్యతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని విమర్శించారు. తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనే తపనతో ప్రతిపక్షాలపై ఆరోపణ లు చేస్తున్నారని, అభద్రతాభావంతో కేసీఆర్‌ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని ధ్వ జమెత్తారు.

ఎన్నికల కమిషన్‌పై అనుమానా లు వ్యక్తమవుతున్నాయని, సీఎం కేసీఆర్‌ చెప్పినట్టే డిసెంబర్‌లో ఎన్నికలు రావడం, ఓటర్ల జాబితా పూర్తి కాక ముందే ఎన్నికల షెడ్యూల్‌ రావడం వల్లే అనుమానాలు పెరిగాయన్నారు. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ అబద్దాలకోరులు అని, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని విమర్శించారు.  ప్రతిపక్షంలో ఎవరు ఉంటే, వారిపై ఐటీ దాడులు చేయడం పరిపాటిగా మారిందని తెలిపారు.త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్‌ గాంధీ సభలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని వీహెచ్‌ విమర్శించారు. ఆర్టీసీ బస్సులకు కేసీఆర్, పోచారం ఫొటోలు ఉన్నాయని, బస్సులను ఆపి పోస్టర్లు చింపి వేసినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అనేక పథకాలు చేపడతామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top