
చింతలపాలెం (హుజూర్‌నగర్): మంత్రి కేటీఆర్ హుజూర్‌నగర్ ప్రాంత అభివృద్ధిపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ‘రోడ్‌షోలో కేటీఆర్ మాటలు చూస్తుంటే.. ఆయనకు స్థానిక పరిస్థితులపై అవగాహన లేదన్న విష యం తేటతెల్లమైంది’అని అన్నారు. ‘బ్రదర్ మీకు ఎవరు స్పీచ్ రాసిచ్చారో అది చేంజ్ చేసుకోండి’అని కేటీఆర్‌ను ఉద్దేశించి ఉత్తమ్ చురక వేశారు. మీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి ఊరిలో కూడా ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు.