ఉత్తమ్‌గారూ నేను ‘పప్పూ’ను కాదు..! | Uttam Kumar Garu, I am no Pappu, tweets KTR | Sakshi
Sakshi News home page

Jan 30 2018 8:22 PM | Updated on Sep 19 2019 8:44 PM

Uttam Kumar Garu, I am no Pappu, tweets KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు తనకు ఆహ్వానం అందలేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ఘాటుగా జబాబు ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు రావాలంటూ తనకు పంపిన ఆహ్వానానికి సంబంధించిన ఈ-ఇన్విటేషన్‌, ఈమెయిల్‌ కాపీలను ఆయన వెల్లడించారు.

ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఆహ్వానం మేరకే వెళ్లినట్లు మంత్రి కేటీఆర్‌ పేర్కొనడం పచ్చి బూటకమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘మేధో దివాళాకోరుతనానికి ప్రతీక అయిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నాకు ఆహ్వానం అందలేదని ఆరోపిస్తున్నారు. ఆయన కోసం ఈ ఆహ్వానం కాపీలను వెల్లడిస్తున్నాను’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘ఉత్తమ్‌గారూ.. నేను ‘పప్పూ’ను కాదు.. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు హుందాగా కరెక్ట్‌ చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

సదస్సుకు వెళ్లే వారు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లుగానే కేటీఆర్‌ సైతం రిజిస్ట్రేషన్‌ చేసుకొని దావోస్‌ వెళ్లారని, కానీ ఈ విషయంలో తనకు ఆహ్వానం అందిందని ఆయన బూటకపు ప్రచారం చేసుకుంటున్నారని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి గతంలో విమర్శించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనాలని కేటీఆర్‌కు ఆహ్వనం రాలేదని, అలాగే రాష్ట్రానికి రూ. వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన చెబుతున్న మాటలు కూడా పూర్తిగా అబద్ధమని ఉత్తమ్‌ ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement