మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి! | Uttam Kumar And Kuntia Fire On CM KCR | Sakshi
Sakshi News home page

Mar 19 2018 5:36 PM | Updated on Sep 19 2019 8:44 PM

Uttam Kumar And Kuntia Fire On CM KCR - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి విభాగంలోనూ కమీషన్లు సాధరణమయ్యాయని, స్వయంగా టీఆర్ఎస్ నేతలే ఈ మాట చెబుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గతంలో లంచాలు అడిగితే చెప్పుతో కొట్టాలని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడెందుకు కమీషన్లు, అవినీతిపై మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో కమీషన్లు సర్వసాధారణమయ్యామని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా సిరిసిల్ల మున్సిపల్ ఛైర్మనే చెప్పారని ఉత్తమ్ గుర్తుచేశారు.

సీఎం కేసీఆర్ కుటుంబం బాటలోనే టీఆర్ఎస్ నేతలు నడుస్తున్నారని మండిపడ్డారు. ప్రతి పనిలో కమీషన్లు దండుకుంటున్నారని పేర్కొన్న ఉత్తమ్.. సిరిసిల్లలో జరుగుతున్న అవినీతికి నైతిక బాధ్యత వహించి మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఒక్కరూ కూడా గెలవరని ఉత్తమ్ జోస్యం చెప్పారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌ను తెరపైకి తీసుకొచ్చి డ్రామాలాడుతున్నారని విమర్శించారు.

విపక్షంలో చీలిక తెచ్చేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి ఆర్‌.సి. కుంతియా ఆరోపించారు. అసలు కేసీఆర్.. అధికార పక్షమా, లేక ప్రతిపక్షాల పక్షామా స్పష్టం చేయాలని కుంతియా డిమాండ్ చేశారు.  హైకోర్టు తీర్పుతో న్యాయం గెలుస్తుందనే నమ్మకం పెరిగిందని, మమ్మల్ని సస్పెండ్ చేసినంత మాత్రాన మా గళం ఆపలేరని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement