‘గెలుపుకోసం లక్షలాది కుటుంబాలు ఎదురుచుస్తున్నాయి’ | Ummareddy Venkateswarlu Speaks On YSRCP Training Classes | Sakshi
Sakshi News home page

గెలుపుకోసం లక్షలాది కుటుంబాలు ఎదురుచుస్తున్నాయి

May 5 2018 4:55 PM | Updated on May 29 2018 4:37 PM

Ummareddy Venkateswarlu Speaks On YSRCP Training Classes - Sakshi

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ( ఫైల్‌ ఫోటో)

సాక్షి, ప్రకాశం: గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓడిపోలేదని, కేవలం వ్యక్తులు మాత్రమే ఓడిపోయారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఒంగోలులో జరుగుతున్న వైఎస్సార్‌సీపీ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఉమ్మారెడ్డి మాట్లాడుతూ... పోలింగ్‌ బూత్‌ మేనేజ్‌మెంట్‌లో మొదటి భాగం ఓటర్లును సమాయత్తం చేసుకోవడం, రెండోది పోలింగ్‌ వరకూ తీసుకెళ్లడమని పేర్కొన్నారు.

‘పార్టీ మొత్తంలో ఏ కమిటీకి లేని ప్రాధాన్యత బూత్‌ కమిటీకి ఉంది. పార్టీ గెలుపు కోసం లక్షలాది కుటుంబాలు ఎదురుచుస్తున్నాయి. అధికార పార్టీ పెట్టిన కేసులతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. బూత్‌ కమిటీ సభ్యులు అంతా సంఘటితంగా ఉండండి. ఓటు లేని వారికి ఓటు హక్కును కల్పించండి. ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా విలువైనదే. ఒక్క ఓటు తేడాతో ఓడిపోయి సీఎం కుర్చీకి దూరమైన నేతలు మనదేశంలో చాలా మంది వున్నారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో నిర్లక్ష్యం చేయకూడదు’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement