బలపరీక్షలో నెగ్గిన ఉద్ధవ్‌ సర్కార్‌ | Sakshi
Sakshi News home page

బలపరీక్షలో నెగ్గిన ఉద్ధవ్‌ సర్కార్‌

Published Sat, Nov 30 2019 3:01 PM

Uddhav Thackeray Govt Win In Floor Test - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కీలకమైన బలపరీక్షలో విజయం సాధించారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు ప్రొటెం స్పీకర్‌ దిలీప్‌ శనివారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బీజేపీ సభ నుంచి వాకౌట్‌ చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వానికి 169 మంది సభ్యుల మద్దతు ఉందని, విశ్వాస పరీక్షలో ఉద్ధవ్‌ ప్రభుత్వం నెగ్గిందని ప్రొటెం స్పీకర్‌ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువుతీరింది.

కాగా సభ ప్రారంభమైన అనంతరం శాసససభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌‌ మాట్లాడుతూ... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్పీకర్‌ సభను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్‌ కొలంబకర్‌ను నియమించారని.. ఉద్ధవ్‌ ప్రభుత్వం కాళిదాసును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అనంతరం సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement
Advertisement