వైరల్‌ వీడియో: ఎంపీ మల్లన్నను పాలతో ముంచెత్తారు!!

TRS MP Malla Reddy Gets Pala Abhishekam - Sakshi

తెలంగాణలో ఇప్పుడు ముందస్తు ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. ఎన్నికల వేళ ఎన్ని కళలు, మరెన్ని విచిత్రాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ప్రజలను ఆకట్టుకోవడానికి నాయకులు చిత్రవిచిత్రమైన ఫీట్లు చేస్తుంటారు. మరోవైపు అభిమానులు కూడా తమకు ఇష్టమైన నాయకులపై తమ ప్రేమను అమాంతం చాటుకుంటారు. ఇదేవిధంగా విద్యాసంస్థల అధిపతి, మల్కాజిగిరి టీఆర్‌ఎస్‌ ఎంపీ మల్లారెడ్డిపై ఆయన అభిమానులు బోలెడంతా ప్రేమను చాటారు. పట్టుపంచె, కండువా కప్పుకొని కూర్చీ మీద కూర్చున్న మల్లారెడ్డికి  ఏకంగా పాలాభిషేకం చేశారు. బకెట్‌ నిండా పాలు తెచ్చి.. చెంబులతో ఆయనపై పోస్తూ.. నిండా తడిపేశారు. అనంతరం పూజారి ఆయనపై అక్షంతలు చల్లి.. ఆశీర్వదించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఈ విధంగా పాలాభిషేకం చేసి.. తమ అభిమానంతో తడిపేసినట్టు తెలుస్తోంది. ఏమైనా మల్లన్నకు ఇలా పాలాభిషేకం చేయడంపై సోషల్‌ మీడియాలో భిన్నమైన వ్యాఖ్యలు వస్తున్నాయి. సెటైర్లు కూడా పేలుతున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top