పద్మావతిని అందుకే ఓడించారు: చిరుమర్తి లింగయ్య

TRS MLA Chirumarthi Lingaiah About Huzurnagar By Elections - Sakshi

సాక్షి, నల్గొండ: తెలంగాణలోని హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానానికి అక్టోబర్‌ 21న ఉప ఎన్నిక జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడారు. హుజుర్‌నగర్‌లో టీఆర్‌ఎస్సే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్‌ ఉత్త మెంటల్‌ కేసని..మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండడని ఆరోపించారు. ఆమె ప్రజలకు అందుబాటులో ఉండదని తెలిసే.. పద్మావతిని కోదాడలో ఓడించారని పేర్కొన్నారు. పద్మావతి ఓడిపోతుందని.. ఆమెను గెలిపిస్తామన్న నేతలకు కూడా తెలుసని లింగయ్య స్పష్టం చేశారు.

ఇక పోతే హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సైదిరెడ్డి ఖరారయినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మీద స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top