స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ గెలుపు

Telangana MLC by-elections Counting Results: TRS Leading - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వరంగల్‌, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్‌ విజయఢంకా మోగించింది. నల్లగొండ, వరంగల్‌, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాలను అధికార పక్షం టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. నల‍్లగొండ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి ...కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిపై గెలుపొందారు. చిన్నపరెడ్డికి 640, లక్ష్మికి 414 ఓట్లు పోల్‌ అయ్యాయి.

ఇక వరంగల్‌ స్థానం నుంచి టీఆర్ఎస్‌ తరఫున బరిలోకి దిగిన పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి (850) విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంగాల వెంకట్రామిరెడ్డి(23)పై ఆయన 827 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక  రంగారెడ్డి స్థానం నుంచి టీఆర్ఎస్‌ తరఫున పోటీ చేసిన పట్నం మహేందర్‌ రెడ్డి ...కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డిపై విజయం సాధించారు.  ఈ నెల 31న జరిగిన ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లో కలిపి 98.35 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 2,799మంది స్థానిక సంస్థల ప్రతినిధులకు గాను 2,753మంది ఓటు హక‍్కు వినియోగించుకున్నారు. ఫలితాలపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

నల్లగొండ
మొత్తం ఓట్లు : 1085
పోలైనవి    :1073
టీఆర్ఎస్‌ : 640
కాంగ్రెస్‌ : 414
చెల్లనవి : 19

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top