టీడీపీ ఎంపీ కొత్త పల్లవి | TDP MP N Siva Prasad Slams PM Modi | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీ కొత్త పల్లవి

Mar 10 2018 4:34 PM | Updated on Mar 23 2019 9:10 PM

TDP MP N Siva Prasad Slams PM Modi - Sakshi

టీడీపీ ఎంపీ ఎన్‌ శివప్రసాద్‌

సాక్షి, చిత్తూరు: తమ పార్టీ నాయకుడైన సీఎం చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం అవమానిస్తోందని చిత్తూరు టీడీపీ ఎంపీ ఎన్‌ శివప్రసాద్‌ ఆరోపించారు. శనివారం చిత్తూరు గాంధీ సర్కిలో ప్రత్యేక హోదాకు మద్దతుగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలక కొట్టి శబ్దం చేస్తు కేంద్రానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశ రాజకీయాల్లోనే సీనియర్‌ నాయకుడైన చంద్రబాబు రాష్ట్రం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అణిగిమనిగి ఉన్నారని చెప్పారు. తమ నాయకుడితో పెట్టుకుంటే ప్రధాని నరేంద్ర మోదీకి చివరకు మిగిలేది బోడి అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. చంద్రబాబుకు సంవత్సరం పాటు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని, తమ నాయకుడిని అవమానిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement