టూ మచ్‌..!

TDP Leader Sirisha Family Have Double Votes in Srikakulam - Sakshi

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీషకు రెండు చోట్ల ఓటు

భర్త, అత్తమామలు, అనుచరులదీ అదే తీరు   

శ్రీకాకుళం , కాశీబుగ్గ : సమావేశాల్లో నీతులు దంచే అధికార పార్టీ నాయకుల అసలు రంగు బయటపడుతోంది. సభల్లో సామాన్యుల కంటే తామేదో గొప్పవారమని చెప్పుకునే నేతల మేడిపండు విషయాలు రానురాను జనాలకు తెలుస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అక్రమంగా తొలగిస్తూ, ఆ తప్పును ప్రతిపక్షంపైకి నెట్టేస్తున్న సమయంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలి అసలు గుట్టు బయటపడింది. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె గౌతు శిరీషరెండు చోట్ల ఓట్లు కలిగి ఉన్నారు. 

మొదటి ఓటు : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మందస మండలం భిన్నాల గ్రామంలో పోలిం గ్‌ బూత్‌ నంబర్‌ 139లో ఎపిక్‌ నంబర్‌ యుఈజె1512607 నంబర్‌తో శిరీష గౌతు తండ్రి గౌతుశ్యామ సుందర శివాజీ అని ఓటు హక్కు కలిగి ఉంది.

రెండో ఓటు:  విశాఖపట్నం జిల్లా తూర్పులో ఆంధ్రా యూనివర్సిటీ పాఠశాల ఆవరణంలో బూత్‌ నంబర్‌ 173లో శిరీషా యార్లగడ్డ (42 సంవత్సరాలు) భర్త వెంకన్నచౌదరి యార్లగడ్డ పేరుతో ఎపిక్‌ నంబర్‌ ఐడివై1048669తో ఓటు హక్కు కలిగి ఉన్నారు.

అల్లుడికీ రెండు చోట్ల..
పలాస ఎమ్మెల్యే శివాజీ అల్లుడు, శిరీష భర్త, పలాస టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి కూడా రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారు.
మొదటి ఓటు : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పురుషోత్తపురంలో పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 64లో ఎపిక్‌ నంబర్‌ యుఈజె0982059తో వెంకన్న చౌదరి యార్లగడ్డ (45 ఏళ్లు) తండ్రి కృష్ణమూర్తి యార్లగడ్డ పేరున ఓటు హక్కు ఉంది.

రెండో ఓటు: విశాఖపట్నం జిల్లాలో తూర్పు నియోజకవర్గంలో బూత్‌ నంబర్‌ 173లో సీరియల్‌ నంబర్‌ 516 లో ఆంధ్రాయూనివర్సిటీ పాఠశాలలో ఎపిక్‌ నంబర్‌ ఐడీవై0548941 నంబర్‌తో వెంకన్న చౌదరి యార్లగడ్డ తండ్రి కృష్ణమూర్తి పేరుతో ఓటు హక్కు కలిగి ఉన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌కు రెండు చోట్లపలాస ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, జిల్లా గ్రం థాలయ సంస్థ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పీరుకట్ల విఠల్‌రావుకు రెండు చోట్లు ఓటు హక్కు కలిగి ఉన్నారు.

మొదటి ఓటు : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పలాస మండలం పెదంచల పంచాయతీలో బూత్‌నంబర్‌ 51లో సీరియల్‌ నంబర్‌ 528లో ఎపిక్‌ నంబర్‌ ఎపి010020366036 నంబర్‌తో పీరుకట్ల విఠలరావు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ గ్రామానికి సుమారు 9కిలో మీటర్లు దూరంలో ఉన్న పలాస–కాశీబుగ్గ జంటపట్టణంలో కాశీబుగ్గ బూత్‌ నంబర్‌ 11లో ఎపిక్‌ నంబర్‌ యుఈజె0973868 నంబర్‌తో విఠల్‌రావు పీరుకట్ల పేరుతో ఓటు పొంది ఉన్నారు.

కుమారుడు కూడా..
గౌతు శిరీష కుమారుడు శ్రవణ శ్రీహర్షకు పలాస మండలం కేదారిపురంలో (ఎపిక్‌ యుఈజె1517077), విశాఖలో (ఎపిక్‌ నంబర్‌ ఐడివై2903557)తో రెండు చోట్ల ఓటు కలిగి ఉన్నారు.

అత్తమ్మ–మామ
శిరీష అత్తమ్మ విజయలక్ష్మియార్ల గడ్డకు విశాఖ, పలాసలో రెండు చోట్ల యుఈజె1517069 ఓటు, ఐడీవై 2293058 నంబర్‌తో ఓటు హక్కు ఉంది. అలాగే శిరీష మామ కృష్ణమూర్తి విశాఖ–పలాసలో ఎపిక్‌ నంబర్‌ యుఈజె1512607, ఐడివై2905206 నంబర్‌తో ఓటు హక్కు కలిగి ఉన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top