అప్పుడే బీజేపీలో చేరుతా; అలా అయితే వద్దు

TDP Leader JC Diwakar Reddy Clarity Over Joining BJP - Sakshi

సాక్షి, అనంతపురం : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అనంతరపురంలో సోమవారం పర్యటించారు. ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన కిషన్ రెడ్డిని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌ స్వాధీనం చేసుకున్న మరుక్షణం బీజేపీలో చేరుతానని ఆయన వెల్లడించారు. కాగా, గత కొంతకాలంగా దివాకర్ రెడ్డి బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

పోలీసులపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసులతో సతమతమవుతున్న జేసీ కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరుతారనే వార్తలు వెలువడుతున్నాయి. అందుకనే బీజేపీ నేతలతో ఆయన టచ్‌లో ఉంటున్నారని ప్రచారం సాగుతోంది. ఇక అనంతపురం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను జేసీ ఆదివారం కలిశారు.‘‘బీజేపీ మన పార్టీ....అందుకే నాకు అభిమానం’’ అని అన్నారు. సత్యకుమార్‌కు బొకే అందించి మాట కలిపారు.
(చదవండి : పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన జేసీ దివాకర్‌ రెడ్డి)

బీజేపీ పునరావాస కేంద్రం కాదు..
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఎవరికీ పునరావాస కేంద్రం కాదని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పురిగెళ్ల రఘురాం అన్నారు. ‘మోదీ, అమిత్‌షా నాయకత్వం నచ్చితేనే.. దేశం మీద ప్రేమ ఉంటేనే బీజేపీలో చేరండి.అంతేగాని కేసుల్నించి తప్పించుకోవడానికి, మీ సొంత ప్రయోజనాలకోసమో, షరతులు పెట్టి మాత్రం బీజేపీలో చేరకండి’అని హితవు పలికారు. 
(చదవండి : జేసీపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్‌ )

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top