మహాకూటమికి ప్రజల గోడు పట్టదా? | Tammineni veerabhadram on mahakutami | Sakshi
Sakshi News home page

మహాకూటమికి ప్రజల గోడు పట్టదా?

Nov 2 2018 2:44 AM | Updated on Nov 2 2018 2:44 AM

Tammineni veerabhadram on mahakutami - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమిలోని పార్టీలు సీట్ల కోసం సిగ పట్లు పట్టుకోవడం తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. బీఎల్‌ఎఫ్‌ చైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌రావుతో కలసి హైదరాబాద్‌లో ఫ్రంట్‌ అభ్యర్థుల మూడోజాబితాను గురువారం విడుదల చేశా రు. తమ్మినేని మాట్లాడుతూ.. మేనిఫెస్టో, ప్రజల హామీల గురిం చి మాట్లాడకుండా మహాకూటమి సీట్ల కోసం పాకులాడుతున్నా యని ఎద్దేవా చేశారు.

ఇప్పటివరకు 70 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్టుగా వెల్లడించారు. మిగిలిన 49 నియోజకవర్గాలకు అభ్యర్థులను మరో వారంలో ప్రకటిస్తామన్నారు. ఈ వారంలోగా  మహాకూటమిలోని పార్టీలు వస్తాయనే అంచనాతోనే ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదని.. వారు వస్తే, ఆ పార్టీలకు ఆ సీట్లు కేటాయిస్తామన్నారు. బీఎల్‌ఎఫ్‌ తాజాగా 14 మందితో మూడో జాబితా విడుదల చేసింది. గతంలోనే ప్రకటించిన మంథని నియోజకవర్గ అభ్యర్థిని మార్చి, పొలం రాజేందర్‌కు సీటిచ్చారు.

మూడో జాబితాలో అభ్యర్థులుగా నిర్మల్‌–అలివేలు మంగ, నిజామాబాద్‌ అర్భన్‌–ఇస్మాయిల్, సిరిసిల్ల–కూరపాటి రమేశ్, జగిత్యాల–కాయితి శంకర్, హుజూరాబాద్‌–కె.లింగారెడ్డి, ఎల్లారెడ్డి–సత్యం సిద్ధార్థ్, నారాయణఖేడ్‌–బసవరాజ్‌ పాటిల్, ఉప్పల్‌–దొమ్మాటి వెంకటేశ్వర్లు, వరంగల్‌ వెస్ట్‌–డి.శ్రీకాంత్‌యాదవ్, కార్వాన్‌–విఠల్‌ను ప్రకటించారు. సీపీఎం అభ్యర్థులుగా నాంపల్లి–ఎస్‌కేఎం.లక్ష్మీకుమార్, పఠాన్‌చెరు–ఆర్‌.శ్రీనివాస్, దుబ్బాక–జి.భాస్కర్, జహీరాబాద్‌–రామచందర్‌ను ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement