రాహుల్‌జీ.. కాస్త మంచి భాష వాడండి

Sushma Swaraj Asks Rahul Gandhi To Maintain Decency Of Language - Sakshi

న్యూఢిల్లీ: పార్టీ అగ్ర నేత ఎల్‌కే అడ్వాణీపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ తన ప్రసంగాల్లో కాస్త మంచి భాష వాడాలని సీనియర్‌ నేత సుష్మా స్వరాజ్‌ కోరారు. శుక్రవారం మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ మాట్లాడుతూ..‘బీజేపీ హిందూత్వ గురించి మాట్లాడుతుంది. హిందుత్వలో గురువే ప్రముఖుడు. గురు–శిష్య సంబంధం గురించి గొప్పగా ఉంటుంది. మోదీకి ఎవరు గురువు? అడ్వాణీ. అలాంటి అడ్వాణీని వేదికపై నుంచి నెట్టిపడేశారు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌ ట్విట్టర్‌లో తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ‘అడ్వాణీజీ మాకు తండ్రి సమానులు. మీ మాటలతో మా హృదయాలు గాయపడ్డాయి. దయచేసి, మీ ప్రసంగాల్లో కాస్త మంచి భాష వాడండి’ అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top