సన్నీడియోల్‌ @ 87 కోట్లు | Sunny Deol declares assets worth Rs 87 cr | Sakshi
Sakshi News home page

సన్నీడియోల్‌ @ 87 కోట్లు

Apr 30 2019 4:19 AM | Updated on Apr 30 2019 4:19 AM

Sunny Deol declares assets worth Rs 87 cr - Sakshi

చండీగఢ్‌/గురుదాస్‌పూర్‌: గదర్, ఘాయల్, బోర్డర్‌ చిత్రాలతో బాలీవుడ్‌ సినిమాలలో తనదైన ముద్ర వేసిన నటుడు, దర్శకుడు, నిర్మాత సన్నీడియోల్‌ సోమవారం గురుదాస్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. తన నామినేషన్‌ పత్రాలతోపాటు ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించారు. తన పేరుమీద, తన భార్య పేరు ఉన్న మొత్తం ఆస్తులను రూ. 87.18 కోట్లుగా ప్రకటించారు. రూ. 60.46 కోట్ల చరాస్తులు, రూ. 21కోట్ల స్థిరాస్తులను ఆయన చూపించారు. 2017–18లో ఆదాయాన్ని రూ. 63,82 లక్షలు, 2016–17లో వార్షికాదాయం 96.29 లక్షలు, 2015–16లో వార్షికాదాయం రూ. 2.25 కోట్లుగా ప్రకటించారు. తన బ్యాంకు ఖాతాలో రూ. 26 లక్షలు ఉన్నాయని, తన భార్య లిండా డియోల్‌ బ్యాంకు ఖాతాలో రూ. 16 లక్షల నగదు ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement