ధైర్యాన్ని ఎంచుకున్నాడు | Sunny Deol Batwara 1947 First Look Out | Sakshi
Sakshi News home page

ధైర్యాన్ని ఎంచుకున్నాడు

Jun 10 2026 4:11 AM | Updated on Jun 10 2026 4:11 AM

Sunny Deol Batwara 1947 First Look Out

సన్నీ డియోల్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘బట్వారా 1947’. రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్‌ డ్రామాలో ప్రీతి జింతా, షబానా ఆజ్మీ, అలీ ఫజల్, కరణ్‌ డియోల్, సర్గమ్‌ సింగ్, ఖుషీ హజారే ఇతర ప్రధాన పా త్రల్లో నటిస్తున్నారు. 

ఆమిర్‌ ఖాన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను మంగళవారం రిలీజ్‌ చేసి, ఈ సినిమాను ఆగస్టు 14న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. ‘ద్వేషం, భయం ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లో అతను ధైర్యాన్ని ఎంచుకున్నాడు’ అంటూ ఈ సినిమాలోని హీరో పా త్ర గురించి వివరించారు. ఇక ఈ సినిమాకు తొలుత ‘లాహోర్‌ 1947’ అనే టైటిల్‌ను మేకర్స్‌ అనుకున్నారు. తాజాగా కొత్త టైటిల్‌ను ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement