చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం | Siddaramaiah Slaps Party Worker In Karnataka | Sakshi
Sakshi News home page

చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం

Sep 4 2019 2:50 PM | Updated on Sep 4 2019 3:58 PM

Siddaramaiah Slaps Party Worker In Karnataka  - Sakshi

సాక్షి, కర్నాటక: కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్‌ ముఖ్యనేత సిద్ధరామయ్య తమ పార్టీ కార్యకర్త చెంప చెల్లుమనిపించిన ఘటన మైసూరు ఎయిర్‌పోర్ట్‌ వెలుపల చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతుండగా పక్కనే ఉన్న పార్టీ కార్యకర్త ఫోన్‌లో ఓ అధి​కారితో మాట్లాడమంటూ విసిగించాడు. ఫోన్‌ మాజీ సీఎం చెవి దగ్గర పెట్టడానికి ప్రయత్నించగా సహనాన్ని కోల్పోయిన మాజీ సీఎం పార్టీ కార్యకర్త పై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సిద్ధరామయ్య మైసూరులో వరదల పరిస్థితిని సమీక్షించడానికి, కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ అరెస్టు నేపథ్యంలో కార్యకర్తలకు మనోస్థైర్యాన్ని కలిగించడానికే పర్యటించారని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. గతంలో కూడా సిద్ధరామయ్య ఇలాంటి వివాదాలు చుటుముట్టాయి 2016లో ప్రజా సమస్యలను తెలుసుకోనేందుకు వెళ్లిన సమయంలో ఓ ఉన్నతాదికారిపై దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆ దాడిని సిద్ధరామయ్య ఖండించారు. తనపై మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement