'ఇలాంటి నాయకుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు'

Sajjala Ramakrishna Reddy Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఏపీలో అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహించడం ద్వారా కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రోజున తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ ప్రతిరోజు సమీక్షిస్తున్నారు. వలస కూలీల అంశంలో సీఎం మానవతా దృక్పథంలో వ్యవహరించాలని సూచించారు. నడచి వెళ్తున్న కూలీలకు భోజన వసతి కల్పించాలని ఆదేశించారు. కేంద్ర సూచనలను అమలు చేయడంలో కూడా ఏపీ ముందంజలో ఉంది. చదవండి: 'ఏ వయసు వారు తప్పు చేసినా శిక్ష తప్పదు'

ప్రజల పట్ల ప్రభుత్వం ఎలా స్పందించాలన్నది విశాఖ గ్యాస్‌ లీక్ ఘటనలో సీఎం జగన్ చూపించారు. నిర్లక్ష్యం వహిస్తే పరిశ్రమలు నిర్వహించేవారు భయపడేలా బాధితులకు భారీ పరిహారం ప్రకటించారు. 10 రోజుల్లో బాధిత కుటుంబాలు, గ్రామాలకు అన్ని సహాయక చర్యలు అందించారు. కరోనా సహాయక చర్యలు, సంక్షేమ పథకాలు ఏకకాలంలో సీఎం జగన్ అమలు చేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది. ప్రభుత్వం మంచి చేస్తున్నా విమర్శలు చేయడమే టీడీపీ నేతల పని. టీడీపీ నేతల ఆలోచనలు రోజురోజుకు దిగజారుతున్నాయి. కరోనా వైరస్ కంటే అత్యంత డేంజరస్ వైరస్.. ఎల్లో వైరస్'‌ అంటూ సజ్జల మండిపడ్డారు. 

ప్రతిపక్ష నేతగా బాబు చేసిందేంటి..?
కరోనా కట్టడి అనేది సక్సెస్ లేదా ఫెయిల్యూర్ కాదు. కరోనా నియంత్రణకు ప్రయత్నం చేయాలి. ఎక్కువ కరోనా కేసులు వచ్చాయని భయపడకూడదు. తక్కువ కేసులు వచ్చాయని ఆనంద పడకూడదు. చంద్రబాబు ఆలోచనలు మాత్రం దుర్బుద్ధితోనే ఉన్నాయి. ఒక్కరోజైనా ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చారా? మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ నేతలు.. సాయంత్రానికి రూ.కోటితో ప్రాణాలు వస్తాయా? అని మాట మార్చారు. రూ.25 లక్షలతో ప్రాణాలు తిరిగి వస్తాయా? చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఓఎన్‌జీసీలో ప్రమాదం జరిగితే బాబు ప్రభుత్వంలో రూ.2 లక్షల పరిహారం ఇచ్చింది. ఇలాంటి క్యారెక్టర్ ఉండే నాయకుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు. చదవండి: మంత్రులకు, ఎమ్మెల్యేలకు సజ్జల లేఖ

కరోనా కాలంలో ఉద్యోగులు సహకరిస్తుంటే.. చంద్రబాబు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలియదు. చంద్రబాబు అధికారంలో ఉండి రైతు రుణమాఫీని అమలు చేయలేక పోయారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మేనిఫెస్టోలోని అంశాలతో పాటు చెప్పనివి కూడా అమలు చేశారు. ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఏపీలో ఆర్థిక లోటు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. పేదలు ఆర్థికంగా నిలబడేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. సీఎం జగన్ మంచి పరిపాలన చూసి టీడీపీ ఓర్వలేక పోతోంది' అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి ఫైర్‌ అయ్యారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top