కోదండరాంతో రేవంత్‌రెడ్డి భేటీ

Revanth Reddy meets Kodandaram over New Political Party - Sakshi

తాజా రాజకీయ పరిణామాలపై చర్చ

సాక్షి, హైదరాబాద్‌: త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించిన టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాంతో కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. తమ బంధువు ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆహ్వానించేందుకంటూ బుధవారం రేవంత్‌రెడ్డి, కోదండరాం ఇంటికి వెళ్లడం, ఇద్దరూ ఏకాంతంగా భేటీ అయి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరువురు నేతలు అధికార టీఆర్‌ఎస్‌ వ్యవహారశైలితో పాటు ప్రతిపక్షాలుగా తాము వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్టు సమాచారం.

ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు ఏం చేయాలనే దానిపై చర్చ జరిగిందని వారి సన్నిహితులు చెపుతున్నారు. అయితే, కోదండరాం పార్టీ ప్రకటనకు కొద్ది రోజుల ముందే రేవంత్‌రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి ఏకాంతంగా చర్చించడం ఎందుకనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో తలెత్తుతోంది. కోదండరాంతో దోస్తీ కోసం రేవంత్‌ కాంగ్రెస్‌ దూతగా కలిశారా లేక వ్యక్తిగత పనిమీదనే వెళ్లి పనిలో పనిగా రాజకీయాలు చర్చించారా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top