‘కేసీఆర్‌కు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదు’

Revanth reddy commented on kcr - Sakshi

కొడంగల్‌: సీఎం కేసీఆర్‌కు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదని ఎమ్మె ల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లోని తన నివాసం లో విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల ఎన్నికలు జరిగే అవకాశం లేదన్నారు.

తెలంగాణలో ఎస్సీ, బీసీ, ఓసీ లకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై ఏ సామాజిక వర్గం వారైనా కోర్టు కెళితే స్టే ఇచ్చే అవకాశం ఉందన్నారు. కేసీఆర్‌కు నిజంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి ఉంటే నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడానికి తెర వెనక కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకత వస్తుందని వాయిదా వేయడానికి ప్రయత్నిస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. సుప్రీం నిబంధనల ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని, కేసీఆర్‌ రూపొందించిన జాబితా ప్రకారం 68 శాతం గ్రామాలు రిజర్వేషన్ల పరిధిలోకి వస్తాయన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top