ప్రశ్నించే వారిని గెలిపించాలి | Revanth Reddy Campaign in LB Nagar | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే వారిని గెలిపించాలి

Apr 10 2019 7:17 AM | Updated on Apr 10 2019 7:17 AM

Revanth Reddy Campaign in LB Nagar - Sakshi

నాగోలు రోడ్డు షోలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి

నాగోలు: ఎదిరించేవాడు లేకపోతే.. బెదిరించే వాడిదే రాజ్యమవుతుందని, పార్లమెంట్‌లో ప్రశ్నించే వారిని గెలిపించాలని కాంగ్రెస్‌ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నాగోలు, కొత్తపేట, చైతన్యపురి, పీఎన్‌టీకాలనీ, గడ్డిఅన్నారం, ఎల్‌బీనగర్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నాగోలు ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే దురాలోచనతో నియంత పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌ కుటిలయత్నాలను ప్రతి ఒక్కరూ ఎండ గట్టాలనన్నారు. అందుకోసం పార్లమెంట్‌ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని కోరారు. చట్టసభల్లో ప్రతిపక్షాల గొంతుక లేకుంగా చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, తెలుగుదేశం నాయకులు సామ రంగారెడ్డి, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మొగుల్ల రాజిరెడ్డి, జక్కడి ప్రభాకర్‌రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి, చిలుక మధుసూదన్‌రెడ్డి, చింతల సురేందర్‌ యాదవ్, ముస్క శేఖర్‌రెడ్డి, దీపక్‌ సింగ్, లింగాల కిషోర్‌గౌడ్, డప్పు రాజు, సామ రామ్మోహన్‌రెడ్డి, సదాశివుడు, కాసాని వేణుగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement